ప్యాంగ్యాంగ్: సొంత నానమ్మ ఇంటిని సైతం కూల్చేసినా ఉత్తర కొరియా ప్రజలంతా కింనాస్తి.. కిమన్నాస్తి గా చూస్తూ ఉండి పోవాల్సిందే... అట్లుంటది కిమ్ తోని.. నియంత రాజ్యం కదా? వివరాలలోకి వెళితే కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్ జోంగ్ ఉన్. ఇక భార్య మరణంతో ఇల్ సంగ్ రెండో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కిమ్ సంగ్ ఏ. వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు యత్నాలు జరిగినట్లు తెలియడంతో అంత:పుర వైరం మొదలైంది. ప్రస్తుత నియంత కిమ్ జొంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఆమెను 1994లో హాప్ జాంగ్ ప్యాలెస్ అనే రాజభవనంలో నిర్బంధించారు. అప్పటికే కిమ్ తాత కిమ్ఇల్ సంగ్ మరణించారు. ఇది దేశ రాజధాని ప్యాంగాంగ్ కు ప్యాంగాంగ్ సంగ్ కు మధ్యలోని ఓ పర్వత ప్రాంతం లో ఉంది. ఇక్కడ 11 హెక్టార్లలో అటవీ ప్రాంతం, హాప్ జాంగ్ నది ఉన్నాయి. ప్రత్యేక భద్రతా సిబ్బంది రక్షణ మధ్య ఉ ద్యోగులు పని చేసేవారు. ఇక తన తండ్రి రెండో భార్య కుమారుడు కిమ్ ప్యాంగ్ ఇల్ ను దౌత్య వేత్త భాద్యతలపై ప్రవాసానికి పంపించారు. అంతకు మించి ఆయన తన సవతి తల్లికి కొంచెం కూడా హాని తల పెట్ట లేదు. 2014లో కిమ్ సంగ్ ఏ మరణించారు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ ఆ ప్యాలెస్ను బుల్ డోజర్ల సాయంతో నేల మట్టం చేయించారు. కనీసం శాటిలైట్ చిత్రలలో గూగుల్ సెర్చ్ కు సైతం ఆనవాలు దొరక్కుండా చేశారు. అట్లుంటది కిమ్ తోని అంటున్నారు రాజకీయ పండితులు.