calender_icon.png 29 March, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

315 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..

26-03-2025 06:25:56 PM

పోలీసులను అభినందించిన ఎసిపి రవికుమార్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలో మంగళవారం 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ వ్యక్తులను విచారించగా బుధవారం 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల విలువ రూ 9,12,500 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై బుధవారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ వివరాలను వెల్లడించారు.

పట్టుబడ్డ నేరస్తులు గుడిమల్ల చంద్రయ్య, కూనారపు బాలకృష్ణ, మొహమ్మద్ సాహెబ్ జానీ, ములుకుల సుధీర్, గోవిందుల శంకర్ లను అరెస్టు చేసి పరారీలో ఉన్న అబ్దుల్ రజాక్ కోసం ప్రత్యేక టీం తో గాలిస్తుండగా మందమర్రిలో అబ్దుల్ రజాక్ పట్టుబడ్డలని తెలిపారు. ఇతడిని విచారించగా గుజరాత్ నుండి విత్తనాలు తీసుకువచ్చే రైతులకు అమ్ముతున్నట్లు చెప్పారన్నారు. మందమర్రికి చెందిన జానీ, చంద్రయ్య, బాలకృష్ణ లకు పత్తి విత్తనాలు అమ్మాయడని చెప్పారు. వీరికి అమ్మిన తర్వాత మందమర్రికి చెందిన తిరుపతి సహాయంతో పొన్నారంకు చెందిన బొలిశెట్టి జనార్ధన్ కు కూడా ఏడు సంచులు (315 కిలోలు) పత్తి విత్తనాలు అమ్మినట్లు తెలిపారు.

దీంతో మందమర్రికి చెందిన తిరుపతి, పొన్నారం గ్రామానికి చెందిన జనార్ధన్ లను పట్టుకుని విచారించగా జనార్దన్ కొనుగోలు చేసిన పత్తి విత్తనాలను తిరుపతి సహాయంతో దేవాపూర్ లోని చింతగూడ గ్రామంలో గల సల్ఫల వాగు పక్కన దాచి అవసరం ఉన్నవారికి అమ్ముతున్నారని తెలిపారు. ఈ సంఘటన ప్రాంతాన్ని తనిఖీ చేశామని అక్కడ 315 కిలోల (7 సంచులు) పట్టు పడ్డాయని, వాటి విలువ రూ 7,87,500 ఉంటుందని తెలిపారు. పట్టుబడ్డ విత్తనాలు స్వాధీనం చేసుకుని మండల మండల వ్యవసాయ అధికారితో పంచనామ నిర్వహించి నిందితులను అరెస్టు చేసినట్లు ఏసిపి రవికుమార్ తెలిపారు. పత్తి విత్తనాలను అమ్ముతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి సిఐ కె .శశిధర్ రెడ్డి, దేవాపూర్ ఎస్సై ఏ. ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ పున్నం చందు, కానిస్టేబుళ్లు సురేందర్, షఫీ, రవి, తిరుపతి, మధు, హోంగార్డులు తిరుపతి, రమేష్, చంద్రమోహన్ లను ఏసీపి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు.