10 June, 2026 | 2:43 AM

10 కిలోల గంజాయి స్వాధీనం

10-06-2026 12:00 AM

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా పట్టివేత

కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారి సంపత్ కృష్ణ, ఇతర సిబ్బంది కలిసి రైల్వే స్టేషన్లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సంబల్పూర్ నుంచి పూణేకి వెళ్లే నాగవల్లి ఎక్‌ప్రెస్ రైల్‌లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సుమారు 10 కిలోల ఎండు గంజాయి లభించింది.

ఆ ఇద్దరి వ్యక్తులు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, మరియు ప్రవీణ్ అని తెలిసింది. నిందితులు ఇద్దరి నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు. నిందితులు ఒరిస్సా లోని రాయగడ్ లో ఎండు గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రాయపూర్‌కు రవాణా చేయుచున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ విక్రమ్ కుమార్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.