* మహబూబాబాద్ జిల్లా సిగ్నల్‌తండాలో దారుణం
మహబూబాబాద్, జనవరి 16(విజయక్రాంతి): ఓ వివా కట్టుకున్న భర్త, అత్తమామలే కడతేర్చి, అ స్థలంలో పిండివంటలు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం సిగ్నల్‌తండాకు చెందిన నాగమణి (35)ని ఆమె భర్త గోపి, అతడి తల్లిదండ్రులు లక్ష్మి, కాటి రాములు, ఆడపడుచు దుర్గ, ఆమె భర్త మహేందర్ ఈ నెల 13న దారుణంగా చంపి శవాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోని గోడ పక్కన పూడ్చిపెట్టారు.
స్థానికులు పోలీసులకు ఫిర్యా దు చేయగా గురువారం ఘటన స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వగా ఆమె మృతదేహం లభించింది. కాగా దారుణానికి ఒడిగట్టిన మృతురాలి భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.