calender_icon.png 7 November, 2024 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెయిన్ వరదల్లో 214 మంది బలి

04-11-2024 01:42:11 AM

  1. వందల మంది గల్లంతు
  2. సహాయక చర్యల్లో 5వేల మంది

వాలెన్సియా, నవంబర్ 3: స్పెయిన్‌లో భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 214కు చేరింది. ఇంకా వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ లభించడం లేదు. ఈ నేపథ్యంలో మరో 5000 మంది అదనపు బలగాలను రెస్క్యూ, క్లీనింగ్ ఆపరేషన్ కోసం పంపుతున్నట్టు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ శనివారం ప్రకటించారు.

ఇప్పటికే 2500 మంది సైనికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో స్పెయిన్ ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌గా దీన్ని అభివర్ణించారు. ఆధునిక స్పెయిన్ చరిత్రలో ఇంతటి విపత్తు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

వాలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సెంటర్ రెస్క్యూ, క్లీనింగ్ ఆపరేషన్‌కు కేంద్రంగా మారింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న విపరీతమైన మార్పుల కారణంగా విపత్తులు సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా స్పెయిన్‌లోని తూర్పు వాలెన్సియాతోపాటు మరో రెండు ప్రాంతాల్లో నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.