న్యూ ఢిల్లీ, జూలై 28: ఇజ్రాయెల్ ఆక్రమిత గోల్డెన్ హైట్స్‌లోని పుట్‌బాల్ మైదానంలో శనివారం జరిగిన రాకెట్ దాడిలో పిల్లలతో సహా 12 మంది మరణించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయిల్ ప్రధా ని నెతన్యాహూ.. దీనికి కారణమైన హెజ్‌బొల్లాను అంత తేలికక వదలబోమని.. ఇరాన్ మద్దతుతో లెబనీస్ గ్రూ ప్ రెచ్చిపోతోందని.. దీనికి తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. కాగా గతేడాది అక్టోబర్ 8 నుంచి ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి హెజ్‌బొల్లా వైపు నుంచి ఇదే అతిపెద్ద దాడిగా తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా పరిగమించిన నెతన్యాహూ.. హెజ్‌బొల్లా గతంలో ఎన్న డూ చూడనంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. దాడి విషయం తెలసుకొని అర్ధంతరంగా స్వదేశానికి తిరిగివచ్చారు. ‘ఫుట్‌బాల్ ఆడుకునే పిల్లలను హత్య చేశారు.. ఆ దృశ్యం చూసి నా హృదయం ముక్కలైంది’ అని కన్నీంటి పర్యంతమయ్యారు. గోలన్ హైట్స్‌లోని డ్రూజ్‌టౌన్‌లో ఈ చిన్నారుల మృతదేహాలకు ఆదివారం నిర్వహించిన అంతిమ యాత్రలో వేలాదిమంది హాజరయ్యారు.