పెషావర్, నవంబర్ 21: పాకిస్తాన్ మరోమారు తుపాకీ మోతతో దద్దరిల్లింది. వాయువ్య ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో షితే ముస్లిం తెగకు చెందిన వ్యక్తులపై ఓ ఆగంతకుడు జరిపిన తుపాకీ కాల్పులో ౪౫ మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అంతే కాకుండా 20 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని పోలీసులు వెల్లడించారు. సున్నీ ముస్లింలకు, షితే ముస్లింలకు మధ్య ఎన్నో రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి.