calender_icon.png 26 October, 2024 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్మన్ పదవికి అడ్డొస్తున్నందుకే హత్య

26-10-2024 01:22:55 AM

  1. ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడే ఈ పనిచేశాడు
  2. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అడ్డుస్తున్నందునే గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ తన అనుచరుడి తో హత్య చేయించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మార్కె ట్ కమిటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సంజయ్ నారాయణరెడ్డి పేరును ప్రపోజ్ చేయగా, జీవన్‌రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డి పేరు ప్రతిపాదిం చారని పేర్కొన్నారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యేపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. తెలంగాణలో హత్యా రాజకీయాలను ఎందు కు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ర్టంలో శాంతి భద్రతలు లేవని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గాంధీ భవన్‌లో జరిగే కాంగ్రెస్ మీటింగ్‌కు ఎమ్మెల్యే ఎందుకు హాజరయ్యారని, రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఎందుకు పాలాభిషేకం చేశారని నిలదీశారు.