calender_icon.png 22 November, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యచేసి.. పొలంలో పాతిపెట్టి

14-11-2024 12:33:53 AM

 ప్రియుడు వీరభద్రంతో స్వాతి 

  1. ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు 
  2. భద్రాద్రి జిల్లా మాచినేనిపేట తండాలో ఘటన 
  3. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13( విజయక్రాంతి):  ప్రియురాలిని హత్య చేసి ఆపై పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మం డలం, మాచినేనిపేట తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. పెద్దపల్లికి చెందిన స్వాతికి, మణుగూరు మండలం  తోగ్గూడెం గ్రామానికి చెందిన సాంబశివరావుతో వివాహమైంది.

కొన్ని రోజులకు సాంబశివరావు మృతి చెందడంతో జీవనోపాధి కోసం స్వాతి కొత్తగూడెంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఈక్రమంలో ఆదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న వివాహితుడైన వీరభద్రంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆరేళ్లుగా వారు సహజీవనం సాగిస్తున్నారు. అయితే వీరభద్రం భార్య కూడా వీరితోపాటు ఉంటున్నట్లు  తెలిసింది. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు పలు కేసుల్లో వీరభద్రం నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈక్రమంలోనే  స్వాతి, వీరభద్రం కలిసి జూలూరుపాడు మండలం, సాయిరాం తండాకు చెందిన హలవత్ రత్నకుమార్, పార్వతిలకు ఉద్యోగం ఆశ చూపి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.16 లక్షలు ఇప్పించారు. తాము మోసపోయామని గ్రహించిన ఆ జంట చేసిన అప్పుడ తీర్చలేక గత నెలలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విదితమే. 

ఈకేసులో విచారణ చేపట్టిన జూలూరుపాడు పోలీసులు స్వాతి, వీరభద్రంను విచారించగా రూ.8 లక్షలు తిరిగి ఇచ్చేందుకు స్వాతి వారం రోజులు గడువు కోరింది.  స్వాతి ఎంతకూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వీరభద్రంను అదుపులోకి తీసుకొని విచారించగా..

తన తల్లి సహాయంతో స్వాతిని పదునైన కత్తితో హత్యచేసి, శవాన్ని బస్తాలో ఉంచి తన పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. విషయం తెలుసుకొన్న కొత్త గూడెం డీఎస్పీ రెహమాన్, జూలూరుపాడు తహసిల్దార్  స్వాతి బిందు సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసీ శవపరీక్ష నిమిత్తం కొ త్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.