calender_icon.png 26 December, 2024 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీలకు పాల్పడుతున్న కిలేడీ అరెస్ట్

25-12-2024 01:14:22 AM

చార్మినార్, డిసెంబర్ 24: భర్త సహకారంతో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా లేడీని కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మహ్మద్ జావేద్ వివరాలు వెల్లడించారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాదత్ కిరాణా స్టోర్ సమీపంలో నివసించే యాకుబ్ ఖురేషీ ఇంట్లో ఈ నెల 14న చోరీ జరిగింది. నగదుతో పాటు బీరువాలో దాచిన బంగారు అభరణాలు కనిపించలేదు. వెంటనే ఖురేషీ కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ అనునాస్పందంగా కనిపించింది. ఆరా తీయగా పాత నేరస్తురాలుగా గుర్తించారు.మంగళవారం నిందితురాలు జకీయా సుల్తానబేగంతో పాటు ఆమె భర్త సలీంను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.