calender_icon.png 1 April, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం లో కిడ్స్ ఫెస్ట్

29-03-2025 08:26:52 AM

అలరించిన  సంస్కృతి కార్యక్రమాలు

 విద్యార్థులలో ప్రతిభా పాటవాలకు రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం పునాది - ఎంఈఓ పరిటాల వెంకటరమణ   

విద్యార్థి దశ నుంచే  క్రమశిక్షణ అలవర్చుకోవాలి - సీఐ రాజు వర్మ 

చర్ల,(విజయ క్రాంతి ): స్థానిక రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం లో కిడ్స్ ఫెస్ట్ కార్యక్రమం శుక్రవారం  ఘనంగా నిర్వహించారు,  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్ల మండల సీఐ రాజు వర్మ , ఎస్సై నర్సిరెడ్డి, ఎంఈఓ పరిటాల వెంకటరమణ, సివికే రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా రాహుల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు , ఈ సందర్భంగా సిఐ రాజవర్గం మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ ముఖ్యమని ఈ దశలోనే చక్కగా చదువుకొని భవిష్యత్తులో  ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని అన్నారు, అనంతరం ఎంఈఓ పరిటాల రమణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వత అనేది చదువుతున్న పాఠశాలను బట్టే ఉంటుందని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో చక్కని వాతావరణం విశాలమైనటువంటి తరగతి గదులు విద్యార్థులలో క్రమశిక్షణ ఇవన్నీ చూశానని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యం డిఎన్ కుమార్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు,

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్మ రాజు మాట్లాడుతూ డాక్టర్ డి ఎన్ కుమార్, ప్రతిభ, సహకారంతో పాఠశాల చక్కని వాతావరణంలో నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరింత అభివృద్ధిలో పాఠశాలను తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఇందులో భాగంగానే ఐఐటి కోర్సు విద్యార్థులకు నేర్పిస్తున్నామని, వేసవిలో కంప్యూటర్ ఉచిత శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మాట్లాడారు ,అనంతరం ఉప ప్రధానోపాధ్యాయులు ఎంఎల్ నరసింహ రావు  మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా రాహుల్ విజ్ఞాన విద్యాలయం రాహుల్  ఫెస్ట్ పేరు మీదుగా నిర్వహిస్తూ నేడు 22వ వర్ధంతి సందర్భంగా కిడ్స్ ఫెస్ట్ నిర్వహించడం ఎంత గర్వంగా ఉందని అన్నారు,

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి ముఖ్యంగా తెలుగు విభాగానికి చెందిన రాము మరియు ప్రదీప్ లు పౌరాణిక ఆధ్యాత్మిక ఘట్టాలతో మహాభారతాన్ని రామాయణ ఇతివృత్తాంతాన్ని  విద్యార్థుల చేత కథాంశంగా ప్రదర్శన చేశారు. మరికొందరు విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ లో చూపరులను  ఆకట్టుకున్నారు,ఈ కార్యక్రమం లో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎంవిఎల్ నరసింహారావు, ఉస్మాన్, బోస్ ,రాము , క్రాంతి, ప్రదీప్ ,శ్రీధర్ ,రాజ, ఆనంద్ , సునీత , ఉష, రమాదేవి, మాధురి, చైతన్యశ్రీ, లావణ్య, శ్రావణి, సంధ్య, సౌజన్య, స్వాతి, తదితర ఉపాధ్యాయ ఉపాధ్యాయినీలు విద్యార్థులు  విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.