calender_icon.png 13 March, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్‌జీలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు

12-03-2025 12:00:00 AM

 ఏఐఎన్యూ వైద్యుల పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జెన్ జీలో కూడా కిడ్నీ సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి. జిమ్ము చేసేవారిలో సీరం క్రియాటినైన్ స్థాయి పెరుగుతుండగా, మరికొందరికి మూత్రంలో ప్రోటీన్ లీకవుతోంది. ఇక కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఒత్తిడి కారణంగా నీళ్లు తాగడం మానేస్తున్నారు. దాంతో వాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లలాంటివి కనపడుతున్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు ఇటీవల కొంతకాలంగా చేసిన పరిశోధనలో వెల్లడయ్యాయి.

ప్రతినెలా తమ వద్దకు వస్తున్న కేసుల్లో కనీసం ఐదారుగురు జెన్ జీ వారే ఉంటున్నారని ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆవుల నవీన్‌రెడ్డి తెలిపారు. ఎక్కు  16 ఏళ్ల మధ్యవయసు వా  అంటే జెన్ జీ వాళ్లే వస్తున్నారని చెప్పారు. క్రియాటినైన్ పెరిగి, ప్రోటీన్ లీకేజి కూడా ఉంటే వెంటనే కిడ్నీ బయాప్సీ చేయిస్తామని చెప్పారు. ఒకవేళ ప్రోటీన్ లీకేజి లేకపోతే మాత్రం ముందస్తు జాగ్రత్తలు చెబుతామన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా దాదాపు జెన్ జీ అందరికీ ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఇవేవీ అంతగా ప్రాణాం తకం కావు గానీ, సమస్యను మాత్రం గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిదని డాక్టర్ ఆవుల నవీన్‌రెడ్డి వివరించారు. మార్చి 13న ప్రపంచ కిడ్నీ డే జరుపుకుంటున్నట్టు తెలిపారు.