న్యూఢిల్లీ, జూలై 19 : ఢిల్లీ కేం ద్రంగా కిడ్నీలు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి సంబంధమున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశీయుల కిడ్నీలను తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. ఒసోలా విహార్‌లో రస్సెల్, రోకాన్, సుమోన్ మియాన్, రతేష్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాడులు ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ము ఠా వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, ఇతర డాక్యుమె ంట్లను స్వాధీనం చేసుకున్నారు.