- మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
- ఇద్దరు అరెస్టు చేసి.. 8 మందిని విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్/ఎల్బీనగర్, జనవరి 24(విజయక్రాంతి) : కిడ్నీ రాకె ట్ కేసును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందన్న మంత్రి... పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్క నిందితున్ని కఠినం గా శిక్షించాలని ఆదేశించారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణి కిపోయేలా చర్యలుంటాయని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.
అవయవ మార్పిడి విషయంలో అనైతిక వ్యవహారాలకు పాల్పడే వారిని భవిష్యత్తులో వారి వృత్తి నుంచి దూరం పెట్టాలన్నారు. మరోవైపు కిడ్నీ మార్పిడి కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సహకరించినవారికి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు.
ఈ కేసులో అలకనంద దవాఖాన చైర్మన్ సుమంత్, దవాఖాన రిసెప్షనిస్టు గోపిని ఇప్పటికే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు. వీరిద్దరితోపాటు మరో ఎనిమిది మందిని సైతం విచారిస్తున్నారు.
సహకరించని సుమంత్
అలకనంద దవాఖాన చైర్మన్ సుమంత్ పోలీసులకు సహకరించడం లేదు. విచారణకు పూర్తిగా సహకరించకుండా న్యాయవాదులతో పోలీసులపై ఒత్తిడి చేయిస్తున్నారు. ఎన్నిరోజులు తనన విచారిస్తారని, కేసు నమోదు చేశారుగా... జైలుకు పంపించడండి అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చా డు.
సుమంత్ న్యాయవాదులు సైతం ఎన్నిరోజులు విచారిస్తారు? జైలుకు పంపించాలని, లేకుంటే కోర్టులో హెర్బియస్ కార్సస్ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు. న్యాయవాదుల పిటిషన్‌తో గురువారం రాత్రి దవాఖాన చైర్మన్ సుమం త్, దవాఖాన రిసెప్షనిస్టు గోపిని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో వైద్యపరీక్షలకు పంపించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి, ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
కొనసాగుతున్న దర్యాప్తు
కాగా, మంగళవారం చేపట్టిన విచారణలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ రాకెట్‌లోని కొందరి వ్యక్తుల అడ్రసు, ఫోన్ నంబర్లు ఇచ్చాడు. వీరంతా తమిళనాడు, కర్నాటకకు చెందిన కిడ్నీ దాతలు, కిడ్నీ స్వీకర్తలు ఉన్నా రు. దీంతో దర్యాప్తు మరింత ముందుకు వెళ్లింది. అలకనంద దవాఖానలో గతంలో సైతం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ప్రాథమిక అధారాలు సేకరించారు.
కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు కనీసం 15 నుంచి 20 మంది వైద్యులతోపాటు ఇతర సిబ్బంది అవసరం. అయితే, అలకనంద దవాఖానలో జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది ఉన్నారు? అనేదానిపై ప్రధానంగా దృష్టిసెట్టారు. చికిత్స చేయాలంటే పూర్తి వైద్య వసతులు, సదుపాయాలతోపాటు పరికరాలు, సిబ్బంది అవస రం.
వీరిని అలకనంద దవాఖాన నిర్వాహకులు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలకనంద దవాఖాన మొదటగా 9 పడకలతో ప్రారంభమైనందని, దవాఖాన లో ప్రత్యేక వైద్యవసతులు, సదుపాయాలు లేదని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
డాక్టర్ నాగేందర్ విచారణ బృందం కూడా దవాఖానలో తనిఖీలు చేసి, గాంధీలో చికిత్స పొందుతున్నవారిని విచారించి, ప్రభుత్వానికి నివేదించారు.