calender_icon.png 25 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ@ రూ.30 లక్షలు

09-07-2024 02:15:28 AM

  • బాధితుడికి రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చిన మధ్యవర్తి 
  • మిగిలిన డబ్బులు అడిగే సరికి బెదిరింపులు 
  • నువ్వు స్నేహితుడికి కిడ్నీ దానం చేస్తూ సంతకం చేశావని వెల్లడి 
  • గుంటూరులో కిడ్నీ రాకెట్ కలకలం

హైదరాబాద్, జూలై 8, (విజయక్రాంతి): విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కిడ్నీ దానం చేస్తే రూ.30లక్షలు ఇస్తామని ఆశచూపి ఓ వక్తిని ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నాక డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరిం చింది. దీంతో బాధితుడు గుంటూరు ఎస్పీ కారల్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి విజయవాడకు చెందిన బాషా సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. మధు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30లక్షలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఆ డబ్బుతో తన ఆర్ధిక సమస్యలు తీరిపోతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయా నికి ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో మధుబాబును విజయవాడలోని విజయ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్ తర్వాత ఒప్పందం ప్రకారం రూ.30లక్షలు ఇవ్వమని మధుబాబు అడుగగా.. రూ.1.10లక్షలు మాత్రమే చేతిలో పెట్టాడు బాషా. మిగిలిన డబ్బులు ఇవ్వమని మధుబాబు అడిగే సరికి.. నువ్వు నీ స్నేహితుడికి కిడ్నీ దానం చేసినట్లు ఫామ్‌లో సంతకం చేశావని.. నీకు ఈ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ అని బాషా చెప్పడంతో నివ్వెరపోయాడు మధుబాబు. దీంతో మోసపోయనని గ్రహించిన బాధితుడు.. తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.