- ఇంటికి వచ్చి కారులో తీసుకెళ్లిన కిడ్నాపర్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బీపీఎం భార్య
- సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాలు
కామారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ పోస్టుమాస్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. బాన్సువాడ మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ 15 సంవత్సరాల నుంచి బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉం టున్నాడు. బుడిమి గ్రామంలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నారు. సాయినాథ్‌ను మంగ ళవారం ఉదయం నలుగురు వ్యక్తులు కారు లో వచ్చి తీసుకెళ్లారు. సాయినాథ్ భార్య రామలక్ష్మి బంధువులకు సమాచారం ఇచ్చిం ది. అనంతరం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటికి వచ్చిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. సాయినాథ్‌తో మాట్లాడాలని చెప్పి భుజంపై చేయి వేసి తీసుకెళ్లినట్లు తెలిపింది. వారి వెనుకే కొంత వెళ్లగా.. బాన్సువాడ పట్టణంలో గల రేషన్ షాప్ ముందర ఆగి ఉన్న కారులో తన భర్తను ఎక్కించుకొని వెళ్లిపోయారని రామలక్ష్మి తెలిపింది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. కిడ్నాప్‌నకు గల కారణాలు తెలియడం లేదు.