బాలుడితో పాటు తెలంగాణకు వచ్చిన నిందితులు
రక్షించిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఒడిశా లో కిడ్నాప్‌కు గురైన బాలుడిని బొ మ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ పోలీసులు సుర క్షితంగా కాపాడారు. గురువారం రాచ కొండ పోలీసులు వెల్లడించిన వివ రాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కోమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని లహాండపల్లి ప్రాంతానికి చెందిన అర్జున్ భీమల్ దంపతుల ఐదేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కి డ్నాప్ చేశారు.
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోమ్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాబును కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్న దుర్యోధన్ బరిహా, పద్మిని మజ్జి అనే ఇద్దరిని పోలీసులు ట్రాక్ చేశారు. వా రు ఒడిశా నుంచి తెలంగాణకు వచ్చిన ట్లు గుర్తించి రాచకొండ పోలీసులకు తెలిపారు. దీంతో సీపీ సుధీర్‌బాబు ఎస్వోటీ, ఐటీ సెల్, బొమ్మల రామా రం పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు.
ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన లోకేషన్ నుం చి సాంకేతికంగా విశ్లేషించుకొని కిడ్నా పైన బాలుడు బొమ్మల రామారం పో లీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో గల ఒక ఇటుక బట్టీ సమీపంలో ఉ న్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, బాలుడిని సురక్షితంగా ఒడిశా పోలీసు లకు అప్పగించారు.
ఇద్దరు నిందితు లు కొద్దిరోజుల పాటు ఇక్కడే ఉండి, ఆ తర్వాత బాలుడిని విక్రయిం చేందుకు ప్లాన్ చేశారని సమాచారం. ఒడిశా పోలీసులు సమాచారం అం దించిన 24 గంటల్లోనే బాలుడిని కా పాడినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.