ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఇంట్లో చొరబడి ఓ వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తేలతాడును అపహరించిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయంజాల్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లగుర్రం అనసూయ (70) సోమవారం ఉదయం ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతాడును దోచుకుని పారిపోయినట్లు తెలిపారు.
వెంటనే ఆమె తన కుమారుడు పుల్లగుర్రం మల్లారెడ్డి కి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి గత రాత్రి రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. కాగా జరిగిన ఘటనపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.