calender_icon.png 16 January, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం

04-09-2024 09:31:30 PM

ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ 

చిన్నారులను రక్షించి.. కిడ్నాపర్ ను పోలీసులకు అప్పగించిన మరో ఆటోడ్రైవర్

హైదరాబాద్,(విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ముగ్గురు చిన్నారులను ఓ ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, మరో ఆటో డ్రైవర్ అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మజీద్ బండలోని ఓ ప్రైవేట్ స్కూల్క్ కి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. గుర్తు తెలియని ఓ ఆటోడ్రైవర్ వచ్చి వాళ్లని బలవంతంగా ఆటో ఎక్కించుకున్నాడు. చిన్నారుల్లో ఇద్దరు బాలురు, ఒక బాలిక ఉన్నారు. ఆటో మజీద్ బండ స్మశానవాటిక వైపునకు వెళ్తుండగా అనుమానంతో చిన్నారులు ఆటోడ్రైవర్ ను ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ గట్టిగా ప్రశ్నించారు. దీంతో అటుగా వెళ్తున్న మరో ఆటోడ్రైవర్ గమనించి అప్రమత్తమయ్యాడు. ఆటోను అడ్డుకుని డ్రైవర్ ను సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను కాపాడిన ఆటోడ్రైవర్ ను పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు అభినందించారు.