calender_icon.png 10 January, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నాప్‌కు గురైన బాలిక సురక్షితం

04-08-2024 07:16:19 PM

24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్‌లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ వ్యక్తి చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించిన పోలీసులు, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాపర్‌ను బీహార్‌కు చెందిన ఎండీ. బిలాల్‌గా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును 24 గంటల్లోనే చేధించారు. చిన్నారిని సైఫాబాద్ భరోసా సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు నిందితుడిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టం మీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు.