calender_icon.png 8 October, 2024 | 5:09 PM

పదేళ్ల తర్వాత కిక్ అప్‌డేట్

05-10-2024 12:00:00 AM

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ నటించిన హిట్ చిత్రాల్లో ‘కిక్’ ఒకటి. 2014లో విడుదలైన ఈ సినిమా సీక్వెల్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల తర్వాత చిత్ర నిర్మాత, దర్శకుడు సాజిద్ నదియావాలా ‘కిక్ గురించి తీపి కబురు చెప్పారు. ‘సికందర్’ సినిమా సెట్‌లో సల్మాన్‌ఖాన్ ఫొటోషూట్ జరిగిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు.

ఈ అప్‌డేట్‌పై సల్మాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా వివరాలు కూడా వెల్లడించాలని కామెంట్లు చేస్తున్నారు. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ నటించిన ‘కిక్’ను ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో అదే పేరుతో తెరకెక్కించారు.

ఇందులో సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా.. సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.