calender_icon.png 24 February, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుబాబులకు కిక్

24-02-2025 12:27:55 AM

  1. కొత్త లిక్కర్ బ్రాండ్‌లకు సర్కార్ ఆహ్వానం
  2. విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న టీజీబీసీఎల్
  3. నాణ్యత, ఆరోపణలు లేనట్టు సెల్ఫ్ సర్టిఫికేషన్ తప్పనిసరి
  4. అభ్యంతరాలపై విచారణ తర్వాత కొత్త బ్రాండ్‌లకు అనుమతి

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): టీజీబీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆదివారం నుంచి కొత్త లిక్కర్ కంపెనీల నుంచి దరఖాస్తు లు తీసుకుంటుంది. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్ల నుంచి అర్జీలు స్వీకరించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలు తమ లిక్కర్  ఉత్పత్తులను తెలంగాణలో అమ్ముకొనే వీలు కలిగింది.

అయితే టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతు న్న తమ మద్యం అమ్మకాల్లో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి ఆరోపణలు లేవని సెల్ఫ్ సర్టి ఫికేషన్ జతపర్చాలని పేర్కొంది. పలు కొత్త కం పెనీలు తెలంగాణలో మద్యం ఉత్పత్తులను అమ్ముకునేందుకు గతంలోనే టీజీబీసీఎల్ అనుమతి ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమ తులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపేసింది. 

కొత్త పాలసీకి శ్రీకారం..

కొత్త లిక్కర్ బ్రాండ్ల ఆహ్వానానికి సంబంధిం చి  ప్రభుత్వం నూతన విధానానికి నాంది పలికింది. కొత్త దరఖాస్తులు ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్‌ను ఆదేశించింది. దీంతో తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్ల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి టీజీబీసీఎల్ ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన అర్జీలను 10 రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని నిర్ణయించారు.

దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నారు. టీజీబీసీఎల్‌లో రిజిస్టరై ఇప్పటికే సరఫరా చేస్తున్న సప్లయర్లు మాత్రం ప్రస్తుతమున్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. టీజీబీసీఎల్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ తెలిపింది.