calender_icon.png 24 December, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కియా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సైరస్

20-12-2024 12:53:59 AM

హైదరాబాద్, డిసెంబర్19 : కియా మో టార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ సైరస్‌ను భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. నగర వినియోగదారులు,  కొత్త టెక్నాలజీ కోరుకునేవారి కోసం   ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోడల్‌లో  స్లైడింగ్, రీక్లైనింగ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-పేన్ పానోరమిక్ సన్‌రూఫ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ టైగర్ ఫేస్, ఆర్17 క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, పడ్డిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సైరస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో  వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి విడుదలవుతుంది.