calender_icon.png 2 February, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధునాతన సౌకర్యాలతో కియా సైరోస్

27-01-2025 12:03:15 AM

సికింద్రాబాద్‌లో ఆవిష్కరించిన కంపెనీ ప్రతినిధులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా కియా సైరోస్ అనే కొత్త మోడల్ ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అ ధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కియా సైరోస్ కారును సికింద్రాబాద్ మరియట్ హోటల్‌లో ఆ కంపె నీ ప్రతినిధులు ఆవిష్కరించా రు.

ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్‌యూవీలో సరికొత్త డిజైన్, టెక్నాలజీ, సదుపాయా లతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. డ్రైవ ర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాంకేతికతను జోడించి ఈ కొత్త మోడల్‌ను రూపొం దించినట్లు చెప్పారు.

వెంటిలేటెడ్ సీట్లతోపాటు, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్, 16 అటానమస్ సేఫ్టీ ఫీచర్లతో పాటు, హై 20 స్టాండర్డ్ రోబస్ట్ సూట్, భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు పేర్కొన్నారు.