calender_icon.png 9 January, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖో ఖో ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

08-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న ఖో ఖో ప్రపంచకప్‌కు సంబంధించి న పూర్తి షెడ్యూల్‌ను ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల చేసింది. జనవరి 13 నుంచి 19 వరకు జరగనున్న టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో 39 జట్లు పాల్గొననున్నాయి.

పురుషుల విభాగంలో 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ భారత్‌తో పాటు నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్ ఉన్నాయి. జనవరి 13న భారత్, నేపాల్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మహిళల విభాగంలో 19 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. గ్రూప్ భారత్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా ఉన్నాయి. జనవరి 16తో లీగ్ మ్యాచ్‌లు పూర్తవ్వనుండగా.. జనవరి 17న ప్లేఆఫ్స్, జనవరి 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.