న్యూఢిల్లీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న ఖో ఖో ప్ర పంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి 19 వరకు జరగనున్న టోర్నీలో మహిళలు, పురుషుల విభాగాలు కలిపి మొత్తం 39 జట్లు బరిలోకి దిగనున్నాయి.
ప్రతీక్ నేతృత్వంలోని పురుషుల జట్టు త మ తొలి మ్యాచ్‌ను నేపాల్ తో, ప్రియాంక కెప్టెన్సీలో మహిళల జట్టు దక్షిణ కొరియాతో ఆడ నున్నాయి. పురుషుల గ్రూప్‌లో భార త్, నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్ ఉండగా.. మహిళల గ్రూప్‌లో భారత్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా ఉన్నాయి. జనవరి 16తో లీగ్ మ్యాచ్‌లు ముగియనుండగా.. 17న ప్లేఆఫ్స్, 19న ఫైనల్ జరగనుంది.