calender_icon.png 23 February, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఖేలో ఇండియా రాష్ర్టస్థాయి ఉమెన్స్ లీగ్ ఉషూ పోటీలు

21-02-2025 12:00:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ ఉషూ పోటీలు గురువారంతో ముగిశాయి. రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు ఉత్సాహంగా పోటాపోటీగా ఆడుతూ తమ ప్రతిభను కనబర్చారు. ఆదిలాబాద్ జిల్లా నుండి 19 పతకాలు సాధించారు.

ఇందులో 6 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు,7 కాంస్య పతకాలు సాధించారు. రాష్ర్టంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ స్థాయిలో క్రీడాకారులు పాల్గొని అదే స్థాయిలో పథకాలు సాధించడం జిల్లాకే గర్వకారణం అని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మాస్టర్ అన్నారపు వీరేష్ , శృతి, మాధవి, శివకుమార్, ప్రణయ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ర్ట అమ్మిచర్ ఉషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కుమార్, జిల్లా పేట సంఘం అధ్యక్షులు కోరేడ్డి పార్థసారధి,  ప్రధాన కార్యదర్శి సాయికుమార్, జిల్లా ఉషూ అసోసియేషన్ కార్యదర్శి వేముల సతీష్ తదితరులు పాల్గొన్నారు.