calender_icon.png 7 November, 2024 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఖర్గేజీ.. తెలంగాణలో చట్టం, న్యాయం లేదు’

31-08-2024 12:41:03 AM

ఇంటిని కూల్చి నిరాశ్రయులుగా మార్చడం అన్యాయం

మహబూబ్‌నగర్‌లో ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ‘డియర్ ఖర్గేజీ... మీరు చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం’ అంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 24 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదల ఇళ్ల కూల్చివేతపై చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. తెలంగాణాలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది ఇదేనని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేశారంటూ ఎక్స్‌లో ఓ వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ నిరుపేదల్లోని 25 కుటుంబాల్లో దివ్యాంగులు కూడా ఉన్నారని అన్నారు. ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధి విధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదని కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా నిరుపేదల పైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి... తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగంలా మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని ఖర్గేను కేటీఆర్ కోరారు.