* నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్న తొడసం ఆడపడుచు
ఆదిలాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తొడసం వంశస్థులు డోలు వాద్యాలతో ఖాందేవ్‌కు పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ఈ జాతరకు వచ్చి ఖాందేవున్ని దరించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
వేడుకల్లో భాగం తొడసం వంశానికి చెందిన ఓ ఆడపడుచు రెండు కిలోల నువుల నూనె తాగి మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకోసం తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి సచ్ఛమైన నువులను సేకరిస్తారు.
గానుగ దారా నూనెను తయారుచేసి దేవుడి సన్నిధిలో పూజలు చేసి, ఆపై తోడసం వంశం ఆడపడుచు ఆ నువుల నూనెను తాగి తమ మొక్కును తీర్చుకోవడంతో అంత బాగుంటుందని తొడసం వం నమ్మకం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో మహారాష్ట్రలోని కేలాపూర్ ఎమ్మె తొడసం రాజు సమక్షంలో ఈ ఏడాది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవితి మం చెందిన నాగుబాయి రెండు కిలోల నువుల నూనె తాగి మొక్కు చెల్లించుకుంది. ఖాందేవుడి జాతర ప్రారంభం తరాత, ఈ 28 నుంచి కేస్లాపూర్ నాగో జాతర ప్రారంభించడం ఆనవాయతీగా వస్తోంది.