calender_icon.png 28 March, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఆదివాసి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి

25-03-2025 04:38:04 PM

స్థానిక కాంగ్రెస్ నాయకుల డిమాండ్..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించి, మంత్రి పదవి ఇవ్వాలని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఖానాపూర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఒకే ఒక్క ఆదివాసి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే, వెడ్మ బొజ్జు పటేల్ కు మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరారు. మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మాజీ వైస్ చైర్మన్ కావలి సంతోష్, నాయకులు జన్నారపు శంకర్, పరిమి సురేష్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ షబ్బీర్ భాష, సలీం ఖాన్, తదితరులు ఉన్నారు.