calender_icon.png 21 March, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

20-03-2025 08:34:59 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి స్టోర్ రూమ్, రోగుల వార్డులను పరిశీలించి, రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యంపై నమ్మకం ఉంచాలని, ప్రభుత్వం ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సదుపాయాలు, వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.

ఈ మేరకు ఆయన ఆసుపత్రి సూపర్డెంట్ వంశీతో మాట్లాడుతూ... ఆసుపత్రిలో ఎటువంటి సదుపాయాలు కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రోగులకు ఎటువంటి కొరత ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పిఎసిఎస్ సత్యనారాయణ, జహీర్, మీర్జా, తాసిల్దార్ సుజాత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సూపర్డెంట్ వంశీ మాధవ్ తదితరులు ఉన్నారు.