calender_icon.png 24 April, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దాహార్తి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే

23-04-2025 05:31:37 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఇటీవల త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు చేసిన విజ్ఞప్తి మేరకు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) స్పందించి వెంటనే రెండు బోర్లు వేయించి కాలనీవాసుల దాహార్తి తీర్చారు. ఈ మేరకు బుధవారం బోర్లలో మోటార్లు బిగించి త్రాగునీటిని అందించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పడిగెల భూషణ్, అబ్దుల్ మజీద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కావాలి సంతోష్, తోట సత్యం, యూసుఫ్ ఖాన్, మైనారిటీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, నేరేళ్ల సత్యనారాయణ, నయీమ్, జహీర్, శ్రీనివాస్, పలువురు ఉన్నారు.