09-04-2025 04:35:22 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం మందపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మందపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ గంగాధర్ ఇటీవల మరణించగా, ఆయన భార్య పల్లికొండ స్వప్న ఇద్దరూ కూతుర్ల పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం తన వెడ్మ ఫౌండేషన్ తరపున ఆ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అన్నివేళలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.