30-03-2025 10:59:49 PM
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం రంజాన్ ఏర్పాట్లను పరిశీలించారు. కావాల్సిన ఏర్పాట్లు సమీక్షించాలని మున్సిపల్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. సోమవారం జరగబోయే రంజాన్ పండుగలో ఎటువంటి కొరతలు లేకుండా చూడాలని, అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్, మధిర సత్యనారాయణ, జహీర్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.