20-03-2025 05:17:19 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రంను గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపల్ శాఖ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దయానంద్ దొనికేని, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు రాజుర సత్యం, అంకం రాజేందర్, పిఎసిఎస్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్, జంగిల్ శంకర్, అద్వాల శేఖర్, జహీర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.