calender_icon.png 22 March, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవతా దృక్పథంతో సాక్షిని విచారించిన ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జితిన్ కుమార్

21-03-2025 11:00:07 PM

మానవతా దృక్పథంతో సాక్షిని విచారించిన ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జితిన్ కుమార్...

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో న్యాయవ్యవస్థలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. న్యాయం అందరికీ సమానంగా అందాలన్న ఉద్దేశం కొన్ని సందర్భాల్లో బాధితులు కోర్టుకు రాలేని పరిస్థితులు ఏర్పడతున్న సందర్భంలో జడ్జిలు స్వయంగా సాక్షి దగ్గరికి తరలి రావటం అరుదైన విషయం. కాగా అలాంటి ఒక విషయంలో ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ జితిన్ కుమార్ చూపిన మానవతా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు. ఒక కేసులో కీలక సాక్షి ఉన్న వ్యక్తికి కాలు గాయంతో బాధపడుతూ కోర్టు లోపలికి రాలేని పరిస్థితిలో ఉండగా న్యాయానికి అడ్డంకులు ఉండ కూడదని సంకల్పంతో జితిన్ కుమార్ కోర్టు ముందరికి ఆటోలో వచ్చిన సాక్షి దగ్గరకు వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈ చర్య పలువురిని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

న్యాయవ్యవస్థలో మానవత దృక్పథంతో బయటకు వచ్చిన ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయపరంగా ఇది ఒక అరుదైన సందర్భం అని చెప్పాలి. కోర్టు ప్రాంగణానికి హాజరు కాలేని సాక్షి కోసం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వయంగా వెళ్లి విచారణ చేయడం బాధితులకు న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ విచారణ సందర్భంగా ఎపీపీ సాక్షికి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. ఈ ఘటన న్యాయరంగంలో మంచి మార్గదర్శకంగా నిలిచింది. న్యాయం అంటే కేవలం నిబంధనల ముసుగులో కాకుండా అవసరమైనప్పుడు సానుభూతితో ముందుకు వెళ్లడం కూడా కావాలి అని జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితిన్ కుమార్ నిరూపించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుండవేణి పరమేశ్వర్ యాదవ్, కిషోర్ నాయక్, రమణారావు, వెంకట్ మహేంద్ర, రాజశేఖర్, వేణు,సలీం, ఖాదర్, తదితరులు ఉన్నారు.