calender_icon.png 20 October, 2024 | 8:57 AM

గత వైభవ మకుటం ఖమ్మం ఖిల్లా

20-10-2024 02:46:19 AM

  1. త్వరలో కోటకు మహర్దశ?
  2. ఖిల్లాను పరిశీలించిన మంత్రులు
  3. ప్రత్యేక కార్యాచరణ అమలు
  4. రోప్‌వే, సదుపాయాల కల్పనకు చర్యలు
  5. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేనా? ఇరుకైన రోడ్లతో ఖిడ్లతో చేరేదెలా ?

ఖమ్మం, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దాదాపు వెయ్యేండ్ల చరిత్ర కలిగిన రెడ్డి రాజుల ఏలుబడిలో ఓ వెలుగు వెలిగిన ఖమ్మం ఖిల్లాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది.

ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించి అమలు చేయబోతుండ డం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖింతో మహర్దశ పట్టనుందని, టూరిజంపరంగా ఖమ్మం పట్టణానికి ఒక ప్రత్యేకత రానుందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.

కోటను పరిశీలించిన మంత్రులు..

ఎంతో చారిత్రక వైభవం కలిగిన ఖమ్మం ఖిల్లాను ఇంతకాలం ప్రభుత్వం సక్రమంగా పట్టించుకోకపోవడంతో విలువైన చారిత్రక సంపదను కోల్పోవాల్సి వచ్చింది. పురావస్త్తుశాఖ అధికారులు కూడా ఇంతకాలం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో జాతి సంపద కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది.గతంలో కొంత అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఖిల్లా గురించి పట్టించు కోలేదు.

ఖిల్లా అంతర్భాగంగా ఉన్న పురాతన జాఫర్ మెట్ల బావిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుని పనులు నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు ఖిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇటీవల జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణారావు సంద ర్శించి పరిశీలించి వెళ్లారు. ఈ సందర్భంగా ఖిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రులు చెప్పారు.

రోప్‌వే ఏర్పాటుకు యత్నం..

ఖిల్లాపైకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. అంత పెద్ద గుట్టపైకి ఎక్కే క్రమంలో ఎంతో వ్యయప్రయాసాలకు గురవు తున్నారు. దీంతో ఖిల్లావైపు రావాలంటే జనం జంకే పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ఖిల్లాపైకి వెళ్లేందుకు రోప్‌వేను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రోప్‌వే ఏర్పాటుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఖిల్లాపైకి తేలికగా చేరుకుని, ఖిల్లా అందాలను తిలకించడానికి వీలుకలుగుతుంది. 

ఇరుకైన మార్గాలు ..ఆక్రమణలు

ఖిల్లా  వద్దకు చేరుకునే ప్రాంతమంతా ఆక్రమణలకు గురైంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే తమ ఆక్రమణల భాగోతం బయటకు వస్తుందేమోనన్న భయంతో  నిర్లక్ష్యానికి గురి చేశారనే విమర్శలు న్నాయి. ఖిమర్శలున్నాయి చేరుకోవాలంటే ఇళ్ల మధ్య లో నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆక్రమణల నేపథ్యంలో రోడ్లు ఇరుకుగా మారడంతో వాహనాల్లో అక్కడికి చేరుకోవాలంటే తలకు మించిన భారమే అవుతుంది. 

లోపల ఆక్రమణలు తొలగించి రోడ్లను విస్తరిస్తే ఖిస్తరిస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగొందే అవకాశం ఉంది. ఇవేవి చేయకుండా రోప్ వే ఒక్కటి ఏర్పాటు చేస్తే మళ్లీ మొదటికే వస్తుందని, అనుకున్న ప్రయోజనం నెరవేరదని స్థానికులు అంటున్నారు. అలాగే  పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటు, స్టాల్స్ ఇతర సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. 

అభివృద్ధిపై నిర్లక్ష్యం.. 

ఎంతో చారిత్రక వైవిద్యం ఉన్న ఖమ్మం  దశాబ్ధాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఇంతవరకు గెలిచిన ప్రతి పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే పబ్బం గడపడం, ఖిల్లా జోలికి పోకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్న చందంగా వ్యవహరించారు.  ఖిల్లాకు చెందిన వేల ఎకరాల కోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయి.

ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటు మున్సిపల్ అధికారుల అవినీతి వల్ల  భూములు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి.  ఖిల్లాను ఆనుకుని పెద్దఎత్తున ఆక్రమణలు ఉన్నాయి.  ఖిల్లా భూములు, కోట గోడలు  భారీగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా రాజకీయ నాయకులు, అధికారులు  తమకేమి పట్టనట్లు వ్యవహరించారే కాని ఆక్రమణలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో  ఖిల్లా ఆక్రమార్కుల చెరలో చిక్కి శల్యమైంది.

కనీసం ఖిల్లాకు పోదామంటే కూడా సరైన మార్గం లేని దుస్థితి ఉంది. ఒక పథకం ప్రకారమే జనం ఖిల్లాకు వెళ్లకుండా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఖిల్లా చుట్టూ ఉన్న విలువైన భూముల్లో నేడు పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్లు, సినిమా హాళ్లు, పేదల గుడిసెలు వెలిశాయి. వాటిని కదిలించే దమ్ము ఏ పార్టీకి లేదనే చెప్పాలి. ఎందుకంటే వాటి జోలికి వెళితే ఆ పార్టీకి ఓట్లు గల్లంతు కావడం తథ్యం.

అందుకే నాయకులెవరూ ఆక్రమణల వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయడం లేదు. అధికారులు మాత్రం అమాస పున్నానికి వచ్చి సందుల్లోంచి వెళ్లి ఖిల్లా బాగు చేస్తామంటారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోవడం ఆనవాయితీగా వస్తుంది.  ఖిల్లాను అభివృద్ధి చేయాలంటే ముందుగా ఆక్రమణదారుల భరతం పట్టాలి. అప్పుడే  ఖిల్లా పూర్తిస్థాయిలో వెలుగులోకి వస్తుంది. చారిత్రక జాతి సంపద కాపాడబడుతుంది.  

ఎత్తున కొండపై కోట..

భారీ కొండలపైన ఖమ్మం ఖిల్లా దర్శనమిస్తుంటుంది. ఖమ్మం నగరానికే మకుటంగా, గత వైభవానికి సాక్షీభూతంగా కనిపించే ఖిల్లా ఎంతో చారిత్రక సంపద ఉంది. ఇది పర్యాటకులను కనువిందు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఖిదు రాతి దర్వాజ ముఖద్వారం, పైన ఫిరంగులు, రెడ్డిరాజులు నిర్మించిన కట్టడాలు, రాతి గోడలు, మట్టి గోడలు, కోట పైనుంచి కిందివరకు నిర్మించిన రహస్య భూమార్గం, నేతి బావి, పెద్ద కోనేరు, ఆనాడు రాచబాట, కోట చుట్టూ నిర్మించిన రాతి గోడలు, దేవతామూర్తుల చిత్రాలు తదితర చారిత్రక సంపదంతా కోటపైనే ఉంది.

ఇవి చూపరులను ఎంతగానో అకట్టుకుంటాయి. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పెద్దఎత్తున పిచ్చి చెట్లు మొలిచాయి. కోటపై శుభ్రం చేసి, లైటింగ్ ఏర్పాటు చేసి, కోనేరును శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకువస్తే ఖమ్మం ఖిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతుంది.

ప్రభుత్వానికి ఆదాయం కూడా పెద్ద ఎత్తున సమకూరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ రక్షణ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రధానంగా పర్యాటకులు ఇక్కడకి రావడం లేదు. గతంలో ఇక్కడికి వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ముందుగా రక్షణ ఏర్పాట్లు చేసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

పర్యాటక ప్రాంతంగా ఖిల్లా

ఖమ్మం  పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఖిలిపారు పైకి వెళ్లేందుకు రోప్‌వే తో పాటు జాఫర్ బావి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఖిప్పారు రోప్‌వే ప్రతిపాదన స్థలం ఎంపిక, ఇతర అంశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోప్‌వేను ఇళ్లపై నుంచి కాకుండా ఖాళీ స్థలం నుంచి ఏర్పాటు చేసే విధంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.