15-03-2025 12:00:00 AM
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు
మునిపల్లి, మార్చి 14 : గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కంకర తేలడంతో వాహనాలు నడిపేవారు ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే నరకం అనుభవిస్తున్నారు.
మండలంలోని ఖమ్మం పల్లి రోడ్డు గుంతల మయంగా మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు ఆ రోడ్డుపై నుంచి చిన్నచెల్మెడ, బోడపల్లి, అంతారం తదితర గ్రామాల ప్రజలు ఖమ్మం పల్లి మీదుగా రాకపోకలు సాగిస్తారు. ఖమ్మం పల్లి రోడ్డు రోడ్డుపై కంకర తేలి గుంతల మైనంగా మారిపోయింది.
రోడ్డు గుంతలమేగా మారిపోవడంతో వాహనదారులు అల్లాపూర్, చిన్నచెల్మెడ మొరం రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మంపల్లి - మునిపల్లి చౌరస్తా లో బుధవారం జరిగే సంతకు వచ్చే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధు లు, నాయకులు, అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.