calender_icon.png 10 January, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరితో ఖమ్మం సస్యశ్యామలం

10-01-2025 12:52:57 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 9 (విజయక్రాంతి): గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ఆ దిశగా సీతారామ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అన్నారు.

గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి తల్లాడ మం  నూతనక ల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి  సంఘం భవాన్ని, గోదాంను మంత్రి ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి నీటితో ఖమ్మం జిల్లా పచ్చగా ఉండాలని ఆలోచించి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిని తీసుకువస్తున్నామని తెలిపారు. 

రాబోయే ఖరీఫ్ నుంచి బీమా 

రాబోయే ఖరీఫ్ పంట నుంచి ప్రతి పంటకు బీమా పథకాన్ని అమలు చేసేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. దిగుమతి తగ్గినా, పంట రాకున్నా ఆ లోటును రైతుకు బీమా కంపెనీల ద్వారా భర్తీ చేసే విధంగా పంటల బీమా పథకాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. రైతులు వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వైపు దృ ష్టి సారించాలని సూచించారు.

ఎమ్మెల్యే దయానంద్ మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం ఆగిపోయిందని, మంత్రి చొరవతో పనులు పునఃప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్  కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి గంగాధర్ పాల్గొన్నారు.

ఖమ్మం ఏడవ డివిజన్ టేకులపల్లిలో మంత్రి తుమ్మల పర్యటించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి డైట్ అడ్మినిస్ట్రేషన్ భవన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీరజ, డైట్ కళాశాల ప్రిన్సి పాల్ సత్యనారాయణ, డీఈవో సోమశేఖర శర్మ, ఆర్డీవో నరసింహారావు పాల్గొన్నారు.