ఖమ్మం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): నకిలీ పత్రాలతో రుణాలు మంజూరు చేసిన ఆరోపణలపై ఖమ్మం రూరల్ డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ ఉపేంద్రనాథ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బ్యాంక్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో అదే బ్యాంక్‌లో పని చేస్తున్న ఎం సృజనకు బాధ్యతలు అప్పగించారు.
ఆయనపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచా రణ జరపగా, ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. గతంలో ఉపేంద్రనాథ్ ఖమ్మం రూరల్ బ్యాంక్‌లో పని చేసినప్పుడు నిబంధనలు అతిక్రమించి, ఇష్టారాజ్యంగా దొడ్డిదా రిలో రుణాలు ఇచ్చి, లక్షలాది రూపాయల కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చి న సంగతి తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా సొంత తమ్ముడికి రుణాలు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి లో తనఖా పెట్టిన భూమి లేకపోయినా నకి లీ పత్రాలతో రుణాలు ఇచ్చారు.
ఇదే కుంభకోణంలో అప్పటి బ్యాంక్ మేనేజర్‌కు సహకరించిన మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రికవరీ యాక్ట్ ప్రకారం అతని వద్ద నుంచి కాజేసిన సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు, ఖాతాదారులు కోరుతు న్నారు. సమగ్ర విచారణ జరిపి, మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.