- 100మందితో అడ్‌హక్ కమిటీ
- అధ్యక్షుడిగా ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్‌గా రాజ్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద ర్ తెలిపారు. ఉత్సవాల జయప్రదం కోసం 100మందితో అడ్‌హక్ కమిటీ, మరో 5 సబ్‌కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా రు. గణేష్ ఉత్సవ కమిటీల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, రెండు కమిటీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఉత్స వాల నిర్వహణ, జయప్రదం కోసం ఏర్పా టు చేయబోయే ఉత్సవ కమిటీకి తాను అధ్యక్షుడిగా, సింగారి రాజ్‌కుమార్ చైర్మన్‌గా ఉంటారని ప్రకటించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే తొలి పూజకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. గవర్నర్‌ను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఖైరతా బాద్ గణేష్ త్వరలో గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో చేరుతారని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ నవరాత్రులను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్లు చేయబోతున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ఉత్సవాల జయప్రదానికి కృషి చేస్తా మన్నారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలు స్థానికంగా వేడుకలు జరుపుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని వారికోసం ఐమాక్స్ ఎదుట మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని చెప్పారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అడ్‌హక్ కమిటీతో పాటు, మరో 5 సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని దానం నాగేందర్ చెప్పారు. ఉత్సవాల జయప్రదం కోసం వచ్చే నిధులను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఓ కమి టీ, విదేశాల నుంచి వచ్చే ఎన్‌ఆర్‌ఐల కోసం ఒక కమిటీ, పోలీసులతో కో ఆర్డినేషన్ కోసం ఒక కమిటీ, మీడియాతో కో ఆర్డినేష న్ కోసం ఒక కమిటీ, ఉత్సవ కమిటీ ఉంటాయని చెప్పారు. కమిటీ సభ్యులంతా సమా నమేనని, అందరికీ ఐడీ కార్డులందజేస్తామ ని చెప్పారు. మీడియా, పోలీసులు, వలంటీర్స్‌కు భోజనం ఏర్పాటు చేస్తామన్నారు.