హైదరాబాద్,(విజయక్రాంతి): బస్తీ బస్తీ ల నుంచే కాక తెలంగాణా లోని పలు ప్రాంతాల నుంచి వెల్లువలా పోటెత్తిన భక్తులందరికీ కొంగుబంగారమైన ఖైరతాబాద్ మహాగణపతి మంగళవారం గంగమ్మ ఒడికి చేరాడు. ఆయన్ని మంత్రపుష్పం, వేద మంత్రోచ్ఛారణల మధ్య బొజ్జ గణపయ్య విసర్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీరి.. భక్తులం దండాలయా ఉండ్రాలయ్యా అంటూ పలు పాటలు పాడుకుని నవరాత్రులు జరిపిన ఖైరతాబాద్ బడా గణేశుడు తమ మిత్రుడికి వీడ్కోలు పలికినట్లుగా బరువెక్కిన గుండెలతో కోట్లాది భక్తులు తిలకించారు. విసర్జన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగోవ నంబర్ క్రేన్ వద్ద గణపయ్య విసర్జన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పూర్తి చేశారు.