calender_icon.png 16 January, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైరతాబాద్ వినాయకుడి తొలిపూజకు..

06-09-2024 12:53:14 AM

సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి బడా గణేశ్ తొలిపూజలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్థానిక ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం సీఎం కార్యాలయంలో రేవంత్‌రెడ్డిని పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను సైతం ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి రావాల్సిందిగా కోరారు.