calender_icon.png 25 March, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యష్ సినిమా.. ఆ పండుగల కానుక!

24-03-2025 12:25:14 AM

స్టార్ హీరో యష్ కథానాయకుడిగా రూపొందుతునన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కే నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్న మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లోకీ డబ్ చేయనున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2026, మార్చి 19న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.