calender_icon.png 12 December, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత

12-12-2024 02:46:31 AM

  • చలి తీవ్రతతో శ్వాస సంబంధ సమస్యలు
  • జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలింపు

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలోని సారంగపూర్ మండలం లోని కేజీబీవీలో విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం చలి ఎక్కువగా ఉండటంతో ఆరుగురు విద్యార్థిను లు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. దగ్గు, దమ్ముతో కళ్లు తిరుగుతున్నా యని ఉపాధ్యాయులకు చెప్పడంతో వారిని హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

విష యం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమో ద్, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, ఆర్‌ఎంవో సుమన్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, మానసిక ఆం దోళనతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు డీఎంహెచ్‌వో ప్రమోద్ తెలిపారు. మానసిక వైద్య నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించామని.. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.

సారంగాపూర్ వైద్యాధికారి శివకుమారితో కలిసి కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసా ద్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డీఎంహె చ్‌వోను అడిగి తెలుసుకున్నారు.