calender_icon.png 27 December, 2024 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం

02-12-2024 12:34:05 AM

  1. అన్న అంటూ వెంటబెట్టుకెళ్లిన యువకుడు
  2. పెంటపల్లిలో ఘటన 

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా లోని పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని అదృశ్యమైంది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన సోదరిడినంటూ ఓ యువకుడు వెంటబెట్టుకెళ్లాడు. ఆ తర్వాత తన కూతురును కలిసేందుకు పాఠశాలకు చేరుకున్న తల్లికి ఈ విషయం తెలిసి షాకయింది.

కడుపునొప్పి ఉం దని, అన్నతో కలిసి ఆసుపత్రికి వెళ్తున్నానంటూ ఓ యువకుడి వెంట వెళ్లిందని ఎస్వో సువర్ణ విద్యార్థిని తల్లికి తెలిపారు. బాలిక ఇంటికి కూడా రాకపోవడంతో తల్లిదండ్రు లు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీ సులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు.