calender_icon.png 16 November, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ మహిళా టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి

16-11-2024 01:29:39 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తపస్ విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): కేజీబీవీ మహిళా టీచర్ల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసి, మినిమం టైం స్కేల్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్ర భుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర ధాన్‌ను తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం కోరింది.

ఈమేరకు హై దరాబాద్‌లో కేంద్ర మంత్రిని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెం ట్ పదోన్నతులకు టెట్ మినహాయిం పు విషయంలో చర్యలు తీసుకోవాల ని కోరామన్నారు.

డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్ తరహా ప్రమోషన్స్‌కు అడ్డంకిగా ఉన్న ఏకీకృత స ర్వీస్ నిబంధనల న్యాయపరమైన చి క్కులు తొలగించేందుకు చొరవ తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఉష, పెంటయ్య, కాశిరావు, కవిత, సాయిబిందు ఉన్నారు.