calender_icon.png 21 March, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాదికి ప్రతి ఒక్కరికీ 6 కేజీల సన్నబియ్యం

21-03-2025 02:06:49 AM

దేశ చరిత్రలో 84 శాతం మందికి ఉచితంగా  సన్నబియ్యం పంపిణీ

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి 

హుజూర్ నగర్, మార్చి 20: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజు మార్చి-30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

గురువారం మఠంపల్లి మండలంలో మట్టపల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకు న్నారు.

ఈ సందర్బంగా ఆలయ ఈఓ, ధర్మకర్తలు సాధార స్వాగతం పలికారు. పూజార్లు వేదమంత్రా లతో ఆశీర్వాచనాలు అందజేసి స్వామి వారి శేష వస్త్రాలతో సత్క రించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం కొరకు స్థల పరిశీలన, సభా ప్రాంగణ ప్రదేశాన్ని, వాహనాలను నిలుపు స్థలాన్ని ఆధికారులతో కలసి పరిశీలించారు.అనంతరం మట్టపల్లి ఆర్య వైశ్య సత్రం నందు  రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి నుండి రాష్ట్రంలోని 84 శాతం  జనాభాకి 6 కేజీల నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చే పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రేడ్డి ని ఆహ్వనించామని తెలిపారు.గతంలో ప్రజలకి ఇచ్చిన దొడ్డు రకం బియ్యం ప్రజలు తినకుండా 5 రూపాయలకే  కోళ్లు ఫారం లకి,అమ్మటం జరిగి దుర్వినియోగం అయ్యాయని అందుకే నిరుపేదల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం ఇచ్చి విప్లవాత్మక మార్పు తీసుక రాబోతున్నమని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఎన్నికైన మొదటి రోజు నుండి ప్రజలకి ఉపయోగపడే విధంగా అద్భుతమైన పరిపాలన అందజేస్తున్నామని తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం,కోదాడ నియోజకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో మల్టి జోన్ 2 రేంజ్ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు,ఈఓ నవీన్,ఆలయ ధర్మ కర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.