ఖమ్మం, జనవరి 20 (విజయక్రాంతి): ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో పట్టుబడిన 216 కిలోల గంజాయిని అడిషనల్ డీసీపీ నరేశ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రవి పర్యవేక్షణలో సోమవారం దహనం చేశారు. తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యు ఎం కన్సల్టెన్సీ ప్లాంట్‌లో దహనం చేశారు. కార్యక్రమంలో సీసీఆర్బీ సీఐ స్వామి, తల్లాడ ఎస్సై కొండలరావు పాల్గొన్నారు.