19-03-2025 01:51:12 AM
అహ్మదాబాద్‌లో ఘటన
అహ్మదాబాద్, మార్చి 18: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు భారీగా గోల్డ్ బిస్కెట్లు పట్టుకున్నారు. వాటి విలువ అక్షరాల రూ.100 కోట్లు అని వారు వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని పాల్ది ప్రాంతంలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న ఏటీఎస్ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. ఈక్రమంలో ఓ అపార్ట్‌మెంట్‌లో దాడులు చేశారు.
88 కిలోల గోల్డ్ బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారంలో ఎక్కువ మొత్తం విదేశాల నుంచి గుట్టుగా ఇండియాకు వచ్చిందని ప్రాథమికంగా గుర్తించారు. దీని వెనుక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న స్టాక్ మార్కెట్ ఆపరేటర్ మహేంద్ర షా పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.